Online Puja Services

ప్రవచనమే ద్విపాత్రాభినయమైతే

13.58.216.18

ప్రవచనమే ద్విపాత్రాభినయమైతే..!

ఒకరేమో పువ్వులపై నడిపిస్తూ..

మరొకరేమో నవ్వులతో తడిపేస్తూ..

ఒకరేమో విషయాన్ని ముక్కుసూటిగా..

మరొకరేమో అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే..

ఒకరేమో అలౌకిక 
ప్రపంచవిహారం..

మరొకరేమో లౌకికప్రపంచ సంచారం..

ఒకరేమో నేరుగా 
విశ్వేశ్వరుని సన్నిధికి..

మరొకరేమో విశ్వం మొత్తం తిప్పి అలా అదే సన్నిధికి.. 

ఒకరేమో విచ్చుకునే
అంతరంగం..

మరొకరేమో టింగురంగం..

ఒకరేమో పంచె..
లాల్చీ..కండువా..

మరొకరేమో అదే పంచె..
ఆపై కోటు..

ఒకరేమో నిరాడంబరం..

మరొకరేమో గండపెండేరం..

ఇద్దరి కతా ఆధ్యాత్మికతే..
ఒకే లక్ష్యం..ఒకటే గమ్యం..
విషయం అదే..
చెప్పే తీరు వేరు..

చాగంటి గుడిగంట..
గరికపాటి ఆ గుడిలో హోమం మంట..

రామాయణమైనా..
భారతమైనా..
భాగవతమైనా..
శివపురాణమైనా..
కార్తీక పురాణమైనా..

చాగంటి చెబితే తన్మయం..
గరికపాటి పలికితే విస్మయం..
ఒకరు వివరిస్తే 
ఇదే ప్రపంచమని అనిపిస్తుంది..
మరొకరు సవరిస్తే
ఇదా ప్రపంచమని 
అనిపిస్తుంది..

ఇద్దరూ ప్రవచనకర్తలే..
ఒకరేమో పరవశకర్త..
మరొకరేమో తన వశకర్త..!

ఇద్దరూ మహా పండితులే..
పూజ్యులు..మాన్యులు..
మించి ధన్యులు..!

ఇద్దరి ధారణ అసాధారణం..
మాటల మూటలు..
విషయ పరిజ్ఞానం 
సాగర పర్యంతం..
ధాటి అనంతం..
మాటాడుతుంటే
గుడిగంటల సవ్వడి వోలె
గంటలు గంటలు..
వినాల్సిందే ఆసాంతం..!

ఒకరేమో భగవంతునికి 
నిన్నటి ప్రపంచపు ఉత్తరం..
మరొకరేమో నేటి లోకపు
ప్రత్యుత్తరం..
ఇద్దరి కీర్తీ లోకోత్తరం..!

ఇద్దరిదీ ప్రియవచనం..
ఇద్దరూ ప్రవచనానికి బహువచనం..!..

రెండు మేరునగాలను
ఒక దరి చేర్చి 
ఎంచి..పోల్చి చూపే ప్రయత్నం చేశాను..
తప్పులుంటే..
తప్పయితే..

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore